లోక్ సభలో క్షమాపణలు చెప్పిన హెగ్దే

SMTV Desk 2017-12-28 12:38:02  ANANTH KUMAR HEGDE, APOLOGISED, LOKSABHA, BJP, NEW DELHI

న్యూఢిల్లీ, డిసెంబర్ 28 : బీజెపీ ఎంపీ, కేంద్ర మంత్రి అనంత్‌కుమార్‌ హెగ్దే రాజ్యాంగం, లౌకిక వాదంపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలకు గురువారం లోక్ సభలో క్షమాపణలు చెప్పారు. రాజ్యాంగాన్ని, పార్లమెంట్‌ను , అంబేద్కర్‌లను తాను గౌరవిస్తానని హెగ్డే పేర్కొన్నారు. ఓ పౌరుడిగా తాను రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఏనాడూ ప్రవర్తించబోనని ఆయన ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు వలన ఎవరైనా బాధపడితే క్షమించాలని ఆయన కోరారు. కాగా హెగ్డే వివరణపై ప్రతిపక్ష కాంగ్రెస్‌ మాత్రం సంతృప్తి వ్యక్తం చేయలేదు. కర్ణాటక రాష్ట్రం కొప్పల్‌ జిల్లాలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న హెగ్డే రాజ్యాంగంలోని లౌకిక(సెక్యులర్‌) పదాన్ని తొలగించాలని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.