స్టాలిన్ ఉన్నంత కాలం గెలవలేం : మంత్రి ఆలగిరి

SMTV Desk 2017-12-28 11:51:03  Chemicals and Fertilizers Minister, M.K. Alagrigi, comments on stalin.

చెన్నై, డిసెంబర్ 28 : శశికళ మేనల్లుడు దినకరన్ ఇటీవల ఆర్కే నగర్ ఉపఎన్నికల ఫలితాలలో భారీ మెజారిటీతో గెలుపొందిన విషయం తెలిసిందే. అధికార అన్నాడీఏంకే పార్టీ రెండవ స్థాన౦లో నిలువగా, మూడవ స్థానంలో ఉన్న డీఎంకే పార్టీకి కనీసం డిపాజిట్ కూడా దక్కలేదు. ఇదిలా ఉండగా.. రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి ఎం.కే ఆలగిరి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. వర్కింగ్ ప్రెసిడెంట్ గా స్టాలిన్ ఉన్నతకాలం డీఎంకే ఏ ఎన్నికల్లో గెలిచే అవకాశం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. "స్టాలిన్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఎదుర్కొన్న తొలి ఎన్నికలోనే ఘోర పరాభవం పొందడం డీఎంకే కు అవమానకరం. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చినన్ని ఓట్లు కూడా డీఎంకే అభ్యర్థికి రాలేదు. కనీసం డిపాజిట్ కూడా దక్కకపోవడం చాలా దారుణం. ఇదంతా స్టాలిన్ నిర్వాకం వల్లే జరిగింది. ఆయన ఉన్నంత కాలం డీఎంకే ఏ ఎన్నికల్లోనూ గెలిచే అవకాశం లేదు" అంటూ వెల్లడించారు.