‘వెదురు’ ఇక చెట్టు కాదు.. పార్లమెంట్ ఆమోదం

SMTV Desk 2017-12-28 11:46:28  bamboo bill, passed, parliament, forest minister prakash jawadhekar

న్యూఢిల్లీ, డిసెంబర్ 28: గిరిజనులు, ఆదివాసులకు ముఖ్య జీవనాధారమైన వెదురును ఇక ‘చెట్టు’ అన్న నిర్వచనం నుండి తప్పిస్తూ ప్రవేశ పట్టిన బిల్లును పార్లమెంట్ ఆమోద ముద్ర వేసింది. ఈ బిల్లును లోక్ సభ ఈ నెల 20న ఆమోదించగా, రాజ్యసభ బుధవారం అంగీకారం తెలిపింది. కాగా ఈ బిల్లును కేంద్ర పర్యావరణ, అటవి శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ ప్రవేశపెట్టారు. ఈ బిల్లుపై అధికార పార్టీ రాష్ట్రాలతో చర్చలు జరపకుండా ఆమోదించడంపై ప్రతి పక్షపార్టీలు, కాంగ్రెస్, బిజు జనత్ దళ్, సమాజ్ వాది పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి జవదేకర్ వివరణ ఇచ్చినప్పటికీ వారు సభనుండి వాక్ అవుట్ చేశారు.