క్రికెట్ నా రక్తంలోనే ఉంది : విరాట్

SMTV Desk 2017-12-28 11:05:18  India, south afrika, test series, captain virat kohli

ముంబై, డిసెంబర్ 28 : ఈ ఏడాది అద్బుతమైన ప్రదర్శనలతో రెచ్చిపోయి అరుదైన విజయాలను సాధించిన భారత జట్టు.. ఇప్పుడదే ఊపులో తమ సత్తాను విదేశంలో చూపించడానికి ఉవ్విలూరుతోంది. "గెలవాలన్న తపనతో ఉన్నాం. నాడు చేయలేని పనులను నేడు చేసి చూపడానికి సిద్దంగా ఉన్నాం. చాలా ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తున్నా౦" అంటూ సఫారీలను ఢీకొట్టడానికి వెళ్ళేముందు భారత్ జట్టు సారధి విరాట్ కోహ్లి వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. "వివాహం కోసం తీసుకున్న విరామం ఆటపై ఎలాంటి ప్రభావం చూపదు. నా జీవితంలో చాలా ముఖ్యమైన దాని కోసం నేను జట్టుకు దూరంగా ఉన్నా. కాని సాధన మాత్రం చేస్తూనే ఉన్నా. నాకు తిరిగి క్రికెట్లోకి రావడం ఏమాత్రం కష్టం కాదు. క్రికెట్‌ నా రక్తంలోనే ఉంది" అంటూ వెల్లడించారు. అదే విధంగా అండర్ 19 ప్రపంచ కప్ కోసం న్యూజిలాండ్ పర్యటనకు భారత జట్టుతో విరాట్ కాసేపు ముచ్చటించి వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు.