షూటింగ్ పూర్తి చేసుకున్న ‘జైసింహా’

SMTV Desk 2017-12-27 22:32:47  JAI SIMHA, BALA KRISHNA, SHOOTING COMPLETE, NAYANATARA, K.S RAVIKUMAR

హైదరాబాద్, డిసెంబర్ 27 : నందమూరి నట సింహం బాలకృష్ణ హీరోగా, నయనతార, హరిప్రియ, నటాషాదోషి హీరోయిన్లుగా కె.ఎస్‌. రవికుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘జైసింహా’. బుధవారంతో రామోజీ ఫిల్మ్‌సిటీలో తీసిన సన్నివేశాలతో ఈ సినిమా చిత్రీకరణ ముగిసింది. ఇటీవల విజయవాడలో ‘జైసింహా’ ఆడియో వేడుకను ఘనంగా నిర్వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌, ట్రైలర్‌కు ప్రేక్షకుల నుండి విశేష స్పందన వస్తుంది. కాగా ఈ సినిమాను . సీకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న ఈ చిత్రం ధియేటర్లలో సందడి చేయనుంది.