మోర్ని మోర్కెల్‌ ధాటికి జింబాబ్వే విలవిల

SMTV Desk 2017-12-27 18:55:30  SOUTH AFRICA, ZIMBABWE, FOUR DAY TEST, MORNE MORKEL, AB DEVILLIERS

పోర్ట్‌ ఎలిజబెత్‌, డిసెంబర్ 27 : సౌతాఫ్రికా – జింబాబ్వేల మధ్య ప్రయోగాత్మకంగా నిర్వహించిన నాలుగు రోజుల డే/నైట్ టెస్ట్ మ్యాచ్ లో తొలి రోజు అతిధ్య దక్షిణాఫ్రికా పటిష్ట స్థితిలో నిలిచింది. టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీ జట్టు 309/9 పరుగులకి ఇన్నింగ్స్ ను డిక్లేర్ చేసింది. సౌతాఫ్రికా జట్టులో యువ ఆటగాడు ఐడెన్‌ మర్‌క్రమ్‌ (204 బంతుల్లో 14 ఫోర్లు, 2 సిక్సర్లతో 125) సెంచరీతో సత్తా చూపగా, సారధి ఏబీ డివిలియర్స్ (53, 63 బంతుల్లో) మెరుపు సెంచరీతో ఆకట్టుకున్నాడు. జింబాబ్వే బౌలర్లలో జార్విస్, ఎంపోఫు మూడేసి వికెట్లు తీసుకోగా, క్రెమెర్‌ రెండు వికెట్లు దక్కించుకొన్నాడు. అనంతరం బ్యాటింగ్ కు దిగిన జింబాబ్వే తొలి ఇన్నింగ్స్ లో సఫారీ పేసర్ మోర్ని మోర్కెల్‌ (5 వికెట్లు) ధాటికి 68 పరుగులకే కుప్పకూలిపోయింది.తర్వాత రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన జింబాబ్వే 8 పరుగుల చేసి ఇంకా 233 పరుగులు వెనుకబడి ఉంది.