ముంబై, డిసెంబర్ 27 : తాజాగా విరుష్క జోడీ ముంబైలో ఓ ఫేమస్ హోటల్లో ప్రముఖ క్రికెట్, బాలీవుడ్, క్రీడాకారులకు ఘనంగా విందు ఏర్పాటు చేశారు. ఈ వేడుక ప్రముఖ తార తోరణంతో అట్టహాసంగా జరిగింది. కానీ ఈ వేడుకలో విరాట్ స్నేహితుడు, అల్ రౌండర్ పాండ్య గైర్హాజరయ్యాడు.. ఇందుకు ఓ బలమైన కారణం ఉంది. అదేంటో తెలుసా...? హార్దిక్ పాండ్య సోదరుడు, క్రునాల్ పాండ్య కూడా తన బ్యాచిలర్ జీవితానికి స్వస్తి పలకనున్నాడు. కునాల్ తన ప్రియురాలైన పంకురి శర్మను వివాహమాడనున్నాడు. విరుష్క జోడీ ఇచ్చిన విందు రోజున కునాల్ కుటుంబసభ్యులు మెహందీ ఫంక్షన్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల సోదరుడి పెళ్లి పనులతో బిజీగా ఉన్న పాండ్య ముంబయిలో విరుష్క జోడీ ఇచ్చిన వివాహ విందుకు హాజరుకాలేకపోయాడు. ఈ కార్యక్రమంలో హార్దిక్-కునాల్ డ్యాన్స్ చేస్తూ సందడిగా గడిపారు. ఇప్పుడు పాండ్య బ్రదర్స్ చేసిన డ్యాన్స్‌కు సంబంధించిన వీడియో అంతర్జాలంలో ఫుల్ హల్ చల్ చేస్తుంది. కునాల్-పంకురి శర్మ వివాహం ముంబయిలోని జేడబ్ల్యూ మారియట్‌లో జరగనుంది. ఈ వివాహం అనంతరం హార్దిక్ టీమిండియాతో కలిసి దక్షిణాఫ్రికా పర్యటనకు పయనం కానున్నాడు.