దుర్గమ్మ సేవలో రాష్ట్రపతి సతీమణి

SMTV Desk 2017-12-27 15:45:25  kanakadurgamma temple, savita kovid, ramnath kovid.

విజయవాడ, డిసెంబర్ 27: ఇంద్రకీలాద్రి కొండపై కొలువుదీరిన శ్రీకనకదుర్గమ్మను రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సతీమణి సవిత కోవింద్ నేడు దర్శించుకున్నారు. ఈ రోజు అమరావతిలో జరిగిన ఫైబర్ గ్రిడ్ ప్రారంభోత్సవంలో కోవింద్ పాల్గొనగా, ఆయన సతీమణి సవిత కోవింద్ కనకదుర్గ అమ్మవారి దర్శనానికి వెళ్లారు. ఆలయానికి విచ్చేసిన ఆమెకు ఆలయ పండితులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న సవిత కోవింద్ ప్రత్యేక పూజలు చేశారు.