హెగ్దే వ్యాఖ్యలపై ఉభయ సభల్లో దుమారం

SMTV Desk 2017-12-27 14:57:44  Winter Session Of Parliament, Anantkumar Hegde, loksabha, rajyasabha

న్యూఢిల్లీ, డిసెంబర్ 27 : కేంద్రమంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్దే వ్యాఖ్యలుపై పార్లమెంటు ఉభయ సభల్లో ప్రతిపక్ష పార్టీల నేతలు నిరసనలకు దిగారు. ఈ ఉదయం లోక్ సభ ప్రారంభం కాగానే అనంత్ కుమార్ హెగ్దే వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి.హెగ్దే ను పదవి నుండి తోలిగించాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అంతే కాకుండా వెల్ లొకి విపక్ష సభ్యులు రావడంతో స్పీకర్ సభను వాయిదా వేశారు. మరోవైపు రాజ్యసభలో కూడా ఇదే విషయంపై దుమారం చెలరేగింది. సభ చైర్మన్ వెంకయ్యనాయుడు పోడియంను ప్రతిపక్ష సభ్యులు చుట్టుముట్టి నినాదాలుతో హోరెత్తించారు. రాజ్యాంగం మీద నమ్మకం లేని వ్యక్తికి పార్లమెంటు సభ్యుడిగా ఉండే అర్హత లేదని కాంగ్రెస్ నేత గులాం నబీ ఆజాద్ నిప్పులు చెరిగారు. తక్షణం హెగ్డేను ఎంపీ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.