అంతరిక్ష ప్రయోగం చేయనున్న ఉత్తరకొరియా

SMTV Desk 2017-12-26 18:17:30  north korea, space experiment, south korea, media, un meeting

సియోల్, డిసెంబర్ 26 : అణుపరీక్షలు, క్షిపణి ప్రయోగాలు చేస్తూ ప్రపంచ దేశాలను తన చర్యలతో కవ్విస్తున్న ఉత్తరకొరియా తదుపరి లక్ష్యం అంతరిక్షమేనా.. ఇదే విషయాన్ని దక్షిణ కొరియా ఇంటిలిజెన్స్‌ చెబుతున్న అంశాలు బాగా బలాన్ని చేకూర్చుతున్నాయి. "ఉత్తరకొరియా ఒక ఉపగ్రహాన్ని సిద్ధం చేసింది. దాని పేరు క్వాంగ్‌మ్యాంగ్‌సాంగ్‌-5. కొన్ని ఛానళ్ల ద్వారా ఇటీవలే ఈ విషయం తెలిసింది" అని దక్షిణకొరియా అధికార వర్గాలు చెప్పినట్లు అక్కడి మీడియా తెలిపింది. ఇప్పటికే తాము అణుశక్తి దేశంగా ఎదిగామని ప్రకటించుకున్న ఉత్తరకొరియా తాజాగా అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. గత ఏడాది ఫిబ్రవరిలో క్వాంగ్‌యాంగ్‌సాంగ్‌-4 ఉపగ్రహాన్ని కిమ్‌ దేశం విజయవంతంగా ప్రయోగించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో యూఎన్‌ సమావేశంలో మాట్లాడిన కిమ్‌ దేశ ప్రతినిధి ఉత్తరకొరియా ప్రజల సంక్షేమం కోసం, ఆర్థిక ప్రగతి కోసం ఉపగ్రహ ప్రయోగాలను చేస్తున్నట్లు వెల్లడించారు.