ఎస్సీ వర్గీకరణకు భాజపా కట్టుబడి ఉంది :భాజపా లక్ష్మణ్‌

SMTV Desk 2017-12-26 13:37:57  MLC Ramachandra Rao of Telangana State President Laxman, mandha krishna, chanchalguda jail

హైదరాబాద్, డిసెంబర్ 26 : నగరంలోని చంచల్‌గూడ జైలు రిమాండ్‌లో ఉన్న ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదిగను, ఎమ్మెల్సీ రామచంద్రరావు తెలంగాణ భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ ఆయనను కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్‌ మాట్లాడుతూ... ఎస్సీ వర్గీకరణకు భాజపా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. అరచేతిని అడ్డుపెట్టి సూర్యుడిని ఆపలేరని పేర్కొన్నారు. మందకృష్ణకు వెంటనే బెయిల్‌ మంజూరు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు జరిగె సందర్భంలోనూ ఇంతటి అణచివేతలు జరగలేదని అన్నారు.