గుజరాత్ ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకారం చేసిన రూపానీ

SMTV Desk 2017-12-26 12:36:42  gujarath, vijay rupani, chief minister, oath, bjp

గాంధీనగర్, డిసెంబర్ 26 : గుజరాత్ రాష్ట్ర 14 వ ముఖ్యమంత్రిగా విజయ్ రూపానీ నేడు ప్రమాణ స్వీకారం చేశారు. సీఎంగా రూపానీ, డిప్యూటీ సీఎంగా నితిన్ పటేల్‌‌తో గుజరాత్ గవర్నర్ ఓపీ కోహ్లీ ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధ్యక్షుడు అమిత్‌ షా, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. బీహార్‌ ముఖ్యమంత్రి నితీశ్‌ కుమార్‌, డిప్యూటి ముఖ్యమంత్రి సుశీల్‌ కుమార్‌ మోదీలు కూడా విచ్చేశారు. కాగా గుజరాత్ సీఎంగా రూపానీ పగ్గాలు చేపట్టడం ఇది రెండో సారి. 2016 లో అప్పటి సీఎం ఆనందిబెన్‌ పటేల్‌ అనూహ్యంగా రాజీనామా చేయడంతో రూపానీ తొలిసారి ముఖ్యమంత్రి భాద్యతలు చేపట్టారు.