మూడో స్థానంలోకి పడిపోయిన కోహ్లీ

SMTV Desk 2017-12-26 12:10:46  icc rankings, virat kohli, indian cricket captain, icc

దుబాయ్, డిసెంబర్ 26 : భారత్ క్రికెట్ సారధి విరాట్ కోహ్లి అంతర్జాతీయ టీ-20 ర్యాంకింగ్స్ లో ప్రస్తుతం మూడో స్థానానికి పడిపోయాడు. ఇటీవల కోహ్లీ తన వివాహ కారణంగా శ్రీలంకతో మూడు టీ-20ల సిరీస్ కు ఆడని విషయం తెలిసిందే. 824 పాయింట్లుతో అగ్రస్థానంలో ఉన్న విరాట్ తాజాగా ఐసీసీ విడుదల చేసిన ర్యాంకింగ్ లో 776 పాయింట్లతో మూడో స్థానంకు పరిమితమయ్యాడు. నియమాల ప్రకారం ఆడని ప్రతి మ్యాచ్‌కు ఐసీసీ రెండు శాతం చొప్పున కోహ్లీ పై కోత విధించింది. కాగా ఆసీస్ ఆటగాడు ఆరోన్‌ ఫించ్‌ (784 పాయింట్లు), వెస్టిండీస్‌ క్రికెటర్‌ ఇవిన్‌ లూయిస్‌ (780) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. కోహ్లీ వన్డేల్లో అగ్రస్థానం, టెస్టుల్లో రెండో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక టీ-20 సిరీస్ హీరోలు, కే.ఎల్ రాహుల్ ఏకంగా 23 స్థానాలు మెరుగుపరుచుకొని నాలుగో ర్యాంకు దక్కించుకోగా, రోహిత్ శర్మ 14 ర్యాంకులో కొనసాగుతున్నాడు. బౌలింగ్ విభాగంలో భారత్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్‌ 16వ ర్యాంకు, చివరి మ్యాచ్ ఆడని బుమ్రా అగ్రస్థానం కోల్పోయి మూడో స్థానంలో ఉన్నాడు. లంకతో టీ-20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా 121 పాయింట్లతో రెండవ స్థానంలో కొనసాగుతుంది.