నాలుగు రోజుల టెస్టు కు అంతా సిద్ధం..

SMTV Desk 2017-12-26 11:32:31  4 days test, south africa, zimbabwe, port elizibeth,

పోర్ట్‌ ఎలిజబెత్‌, డిసెంబర్ 25 : ప్రపంచంలో అత్యధిక మంది ఆదరించే ఆట క్రికెట్.. ఎన్నో మార్పులతో అభిమానులను అలరిస్తున్న ఈ క్రీడా మరో కొత్త రూపంలో రానుంది. టెస్టు అంటే 5 రోజులు అది కూడా డే లోనే జరిగేది. కానీ ఇప్పుడు నాలుగు రోజుల డే/నైట్‌ టెస్ట్ ను ఈ రోజు ప్రయోగాత్మకంగా నిర్వహించనున్నారు. ఆతిథ్య దక్షిణాఫ్రికా, జింబాబ్వే పోటీపడుతున్న ఈ డే/నైట్‌ టెస్టు మంగళవారం ఆరంభం కానుంది. ఇప్పుడైతే ఇది ప్రయోగాత్మకమే! పూర్తిస్థాయిలో మాత్రం కాదు. ఐదు రోజుల టెస్టు మ్యాచ్‌తో పోలిస్తే ఈ మ్యాచ్‌లో కొన్ని నిబంధనలు మార్పులు చోటు చేసుకున్నాయి. * ఐదు రోజుల ఆటలో ఆరు గంటలు ఆడాలి. కానీ నాలుగు రోజుల మ్యాచ్ లో ఆరున్నర గంటల ఆట ఉంటుంది. *కనీస ఓవర్లు 90కి బదులు 98. * ఫాలో ఆన్‌ ఇవ్వడానికి 150 పరుగుల ఆధిక్యం సరిపోతుంది. ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్ లలో 200, అంత కంటే ఎక్కువ ఉండాలి.