31న రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తా :రజనీకాంత్

SMTV Desk 2017-12-26 11:30:17  rajinikanth party, rajiikantha party announcement.

చెన్నై, డిసెంబర్ 26: సూపర్ స్టార్ రజనీకాంత్ ఎప్పుడెప్పుడు రాజకీయ రంగ ప్రవేశం చేస్తారోనని ఆయన అభిమానులు వెయ్యి కన్నులతో వేచి చూస్తున్నారు. వారి ఆశలు నేరవేర్చే దిశగా ఈ నెల 31న రాజకీయ కార్యాచరణ ప్రకటిస్తానని సంచనల వ్యాఖ్యలు చేశారు. అభిమాలనులతో నేటి నుంచి ఆయన వరుస సమావేశాలు నిర్వహించి, ఈ నెలాఖరున ఏర్పాటు చేసే సమావేశంలో పార్టీని ఆయన ప్రకటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...తనకు రాజకీయాలు కొత్త కాదన్నారు. 1996 నుంచి రాజకీయాలను చూస్తూనే ఉన్నానని అన్న ఆయన, ఇప్పటికే చాలా ఆలస్యం అయిందంటూ వెల్లడించారు. ఒక్కసారి యుద్ధంలోకి దిగితే... గెలిచి తీరాలంటూ తన అభిమానులకు దిశానిర్దేశం చేశారు. నటించే అవకాశం వస్తే చాలు నా ప్రతిభను కనబరుస్తా అనుకున్న కానీ సినిమాల్లో నటించి సూపర్ స్టార్ అవ్వాలనుకోలేదన్నారు. డిసెంబర్ 31 కొరకు అభిమానులు ఆసక్తిగా వేచిచూస్తున్నారు.