వారిద్దరూ గొప్ప క్రీడాకారిణీలు: కరోలిన మారిన్

SMTV Desk 2017-12-25 18:01:44  PBL SEASON-4, CAROLINA MARIN, PV SINDHU, SAINA NEHWAL

గువహతి, డిసెంబర్ 25 : పీబీఎల్ (ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్) సీజన్-4 లో స్పెయిన్ స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి కరోలిన మారిన్ హైదరాబాద్‌ హంటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం నార్త్‌ ఈస్ట్‌ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 2-5తో హంటర్స్‌ విజయం సాధించి టోర్నీలో తొలి విజయం నమోదు చేసింది. మ్యాచ్ తర్వాత మారిన్, సైనా, సింధు గురించి మాట్లాడుతూ...” సైనా, సింధు గొప్ప క్రీడాకారిణీలు. ఇద్దరి శైలి విభిన్నంగా ఉంటుంది. . ప్రస్తుతం మహిళా సింగిల్స్‌ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. టాప్-10లో ఉన్న ఆటగాళ్లంతా దగ్గరిదగ్గరిగా ఉన్నా ఎవరి ప్రతిభ వారిదే. కొత్త కొత్త ఆలోచనలతో ఆడాలి. అప్పుడే విజయం వరిస్తుంది” అని మారిన్ వెల్లడించింది.