కారు ప్రమాదంలో సినీ నటుడికి గాయాలు...

SMTV Desk 2017-12-25 15:44:01  actor accident, hyderabad nawabs actor in accident.

హైదరాబాద్, డిసెంబర్ 25: "హైదరాబాద్ నవాబ్స్" సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆర్కే కు కారు ప్రమాదంలో గాయాలయ్యాయి. ఆయన కారులో ఆదివారం సాయంత్రం జూబ్లిహిల్ల్స్ రోడ్ నెం 31 నుండి రోడ్ నెం 36 వైపు వెళ్తుండగా, ఓ మహిళ నడుపుతున్న కారు వేగంగా వచ్చి ఢీ కొట్టింది. దీంతో ఆర్కే ప్రయాణిస్తున్న కారు బోల్తా పడడంతో, గమనించిన స్థానికులు ఆయన్ను బయటకు తీసి అపోలో ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.