రికార్డు సృష్టించిన మాలిక్, అజమ్‌

SMTV Desk 2017-12-25 15:18:57  babar azam, shoib malik , six records, pakisthan cricket players

న్యూఢిల్లీ, డిసెంబర్ 25: ఆరు బంతులకు ఆరు సిక్స్ లు అంటే... గుర్తొచ్చేది భారత్ తరపున యువరాజ్ సింగ్.. 2007ప్రపంచ కప్ లో భాగంగా ఇంగ్లాండ్ బౌలర్ బ్రాడ్‌ బౌలింగ్ లో యువీ ఆరు సిక్స్ లు బాది రికార్డు సృష్టించాడు. టీ-20 ల్లో అత్యధిక వేగవంతమైన సెంచరీ అంటే, భారత్ తరపున రోహిత్ శర్మ సునామీ ఆట ప్రతి అభిమాని ముందు మెదులుతుంది. తాజాగా ఈ రికార్డు ను పాక్ క్రికెటర్లు బద్దలు కొట్టారు... కంగారు పడకండి.. అంతర్జాతీయ మ్యాచ్ ల్లో కాదు. మరెక్కడా అనుకుంటున్నారా? అయితే చదవండి... ఫైసలాబాద్‌లో షాహిద్‌ అఫ్రిది ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో షాహిద్‌ అఫ్రిది రెడ్‌- షాహిద్‌ అఫ్రిది గ్రీన్‌ జట్ల మధ్య పది ఓవర్ల మ్యాచ్‌ జరిగింది. ఈ మ్యాచ్‌లో రెడ్‌ తరపున షోయబ్‌ మాలిక్‌ బాబర్, అజమ్‌ వేసిన 7వ ఓవర్లో ఆరు బంతులను సిక్స్‌లుగా మలిచాడు. కాగా ఈ మ్యాచ్ లో షాహిద్‌ అఫ్రిది రెడ్‌ జట్టు పది ఓవర్లలో 201 పరుగులు చేసింది. కానీ గ్రీన్‌ జట్టు తరపున బాబర్ అజమ్‌ మెరుపు వేగంతో 26 బంతుల్లోనే 11 సిక్సర్లు, 7 బౌండరీలతో సెంచరీ సాధించి షాహిద్‌ అఫ్రిది గ్రీన్‌ జట్టు కు విజయం అందించాడు.