క్షీరములందు.. ఒంటె క్షీరము మేలయా...

SMTV Desk 2017-12-25 14:06:31  camel milk, milk. medicine from camel milk.

జైపూర్, డిసెంబర్ 25: పాలుఎంతో శ్రేష్ఠమైన బలవర్ధక ఆహారము. తాజాగా చేసిన పరిశోధనల్లో ఆవు, గేదె పాలకంటే ఒంటె పాలు ఎన్నో వ్యాధులను రాకుండా నిలువరిస్తుందని తేలింది. ఒంటె పాలు త్రాగడం వల్ల మధుమేహం, హృద్రోగాలు, ఆటిజం, కేన్సర్ వంటి రోగాలు దరిచేరకుండా దోహద పడుతుందని. ఈ విషయం తెలిసిన ఒంటె పాల విక్రయానికి రాజస్థాన్ సహకార పాడి పరిశ్రమ ఆభివృద్ధి సంస్థ వారు కౌంటర్లు పెట్టాలని నిర్ణయించారు. రాజస్థాన్ లోని కోట, అజ్మీర్, జోధ్ పూర్, భరత్ పూర్ నగరాల్లో ఒంటె పాలను నిల్వ ఉంచేందుకు శీతలీకరణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పుడు సరఫరా అవుతున్న పాల ప్యాకెట్ల మాదిరిగా, ప్యాక్ చేసిన ఒంటె పాలను సరాస్ బూత్ ల ద్వారా అమ్మడానికి ఆ సంస్థ రంగం సిద్దం చేస్తుంది. రాజస్థాన్ రాష్ట్ర ముఖ్యమంత్రి వసుంధరా రాజే ప్రత్యేకంగా ఒంటె పాల అమ్మకం ప్రాజెక్టు అమలు చేయడంతో అందరూ ఆసక్తిగా చూపుతున్నారు. ఈ పాలు లీటర్ కు రూ.150 నుండి 200 ఉండాలని ఆదేశించారు.