వాషింగ్టన్‌ సుందర్ అరుదైన ఘనత

SMTV Desk 2017-12-25 13:58:11  washington sundar, india, t-20 record, sri lanka

ముంబై, డిసెంబర్ 25 : ముంబైలో నిన్న భారత్-శ్రీలంక మధ్య జరిగిన మూడు టీ-20లో చెన్నై యువ కిరణం వాషింగ్టన్‌ సుందర్ అరంగేట్రం చేసి అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. భారత్ తరపున అత్యంత పిన్న వయసులోనే అంతర్జాతీయ టీ20ల్లోకి ప్రవేశించిన ఆటగాడిగా గుర్తింపు పొందాడు. ఈ మ్యాచ్ లో సుందర్, కుశాల్ పెరీరా వికెట్ ను దక్కించుకున్నాడు. ఇంతకముందు ఈ రికార్డు ఉత్తరాఖండ్ కు చెందిన యువ ఆటగాడు రిషిబ్ పంత్ ‌(19 ఏళ్ల 120 రోజులు) పేరిట ఉంది. కాగా చివరి టీ-20 నామ మాత్రపు మ్యాచ్ కావడంతో ప్రధాన బౌలర్లు చాహల్‌, బూమ్రాలకు విశ్రాంతినిచ్చిన మేనేజ్ మెంట్, వారికి బదులుగా వాషింగ్టన్‌ సుందర్‌, మొహ్మద్‌ సిరాజ్‌లను తుది జట్టులో స్థానం కల్పించిన సంగతి తెలిసిందే.