అభిమానులకు క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలిపిన క్రీడాకారులు

SMTV Desk 2017-12-25 13:25:49  christmas , wishes, sports players, raina, rohith sharma

న్యూఢిల్లీ, డిసెంబర్ 25 : క్రిస్మస్‌ పర్వదినం సందర్భంగా పలువురు క్రీడాకారులు తమ అభిమానులకు సామాజిక మాధ్యమాలు వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాంతాక్లాజ్‌ టోపీలు ధరించి అంతర్జాలం ద్వారా ఫొటోలు పంచుకుని సందడి చేశారు. తమ కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి క్రిస్మస్‌ వేడుకల్లో పాల్గొన్న ఆనంద క్షణాలను, ఫొటోల రూపంలో షేర్ చేసుకున్నారు. # ప్రతి ఒక్కరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు: రోహిత్‌ శర్మ # మెర్రీ క్రిస్మస్‌: సురేశ్‌ రైనా # అందరికీ మెర్రీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు: రవిచంద్రన్‌ అశ్విన్‌ # మెర్రీ క్రిస్మస్‌: సైనా నెహ్వాల్‌ # ప్రతి ఒక్కరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు: హార్దిక్‌ పాండ్య # అందరికీ క్రిస్మస్‌ శుభాకాంక్షలు: కేఎల్‌ రాహుల్‌ # ఈ సీజన్‌ మొత్తం సంతోషం, చక్కగా ఉండాలని కోరకుంటూ క్రిస్మస్‌ శుభాకాంక్షలు: అభినవ్‌ బింద్రా