అసోం, మేఘాలయలో వరదల బీభత్సం..

SMTV Desk 2017-06-18 15:28:25  Northeastern state, Assam, Meghalaya Floods

అసోం, జూన్ 18 : ఈశాన్య రాష్ట్రాల వరదల బీభత్సనికి అక్కడి నగర వాసుల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయీ. వరదలు ముంచుకు రావటంతో వేలాదిమంది ప్రజలు నిరాశ్రయులైనారు. మేఘాలయలోని రిబోయ్ జిల్లాలో శనివారం ఉదయం కొండచరియలు విరిగిపడటంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందగా మరో ఇద్దరు మహిళలు గల్లంతయ్యారు. గత కొన్ని రోజులుగా ఇక్కడ ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవటంములన విరిగి పడిన కొండ చరియల కింద పలువురు చిక్కుకుని ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు. ఇందులో భాగంగా రెస్క్యూ సిబ్బంది సహాయ చర్యల్లో పాలు పంచుకుంటున్నారు. ఇక అసోంలో వరదల కారణంగా 30 వేల మంది నిరాశ్రయులయ్యారు. దీంతో ప్రభుత్వం ఎక్కడికక్కడ పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసింది. 52 గ్రామాల నుంచి 25 వేల మంది ప్రజలు వరదల కారణంగా నిరాశ్రయులైనట్టు అధికారులు వెల్లడించారు. వరదలు ముంచుకు రావటంతో నదులు ప్రమాద స్థాయిని మించి పొంగిపోర్లుతున్నయని దీంతో నది తీర ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసిన అధికారులు, ఈ వరదల నుంచి వేలాదిమందిని కాపాడుతున్నట్లు తెలిపారు.