ఇసుకతో శాంతాక్లాజ్ భారీ శిల్పం..లిమ్కా బుక్ లోకి...

SMTV Desk 2017-12-25 11:09:09  limka book of records, Santa Claus big ideal.

భువనేశ్వర్, డిసెంబర్ 25: ఇసుకను తన కళాత్మక ప్రతిభతో శిల్పాలుగా చేసి, సందర్శకుల మన్ననలతో పాటు భారత రాష్టప్రతి పురస్కారాన్ని కూడా అందుకున్నారు ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్. సైకత శిల్పాల నిర్మాణంలో తనదైన శైలితో ప్రత్యేక ముద్ర వేసుకున్న ఓ సృజనాత్మక కళాకారుడు సుదర్శన్ ఇప్పుడు క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ శాంతి కోరుతూ శాంతాక్లాజ్ శిల్పం తయారు చేసారు. తన 40 మంది శిష్యులతో కలిసి 600 టన్నుల ఇసుకను వాడుతూ, 50 అడుగుల వెడల్పు, 25 అడుగుల ఎత్తుతో ఈ శిల్పాన్ని నిర్మించారు. అయితే ఆ శిల్పం లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్ లో స్థానం దక్కించుకుంది. ఈ సందర్భంగా సుదర్శన్ మాట్లాడుతూ... క్రిస్మస్ సందర్భంగా ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ, దాదాపు 35 గంటల పాటు శ్రమించి దీన్ని తయారు చేశామన్నారు.