మీరు లేకపోతే నేను లేను: సోనమ్ కపూర్

SMTV Desk 2017-12-24 18:05:09  sonam kapoor, anil kapoor,

ముంబాయి, డిసెంబర్ 24: నేడు బాలీవుడ్‌ నటుడు, నిర్మాత అనిల్‌ కపూర్‌ (61) జన్మదినం సందర్బంగా తన కుమార్తె నటి సోనమ్ కపూర్, తన తండ్రితో ఉన్న సాన్నిహిత్యాన్ని, అనుభవాలను అభిమానులతో పంచుకుంది. సోనమ్ కపూర్ తన ట్విట్టర్ వేదికగా.." ప్రపంచ౦లో నన్ను బాగా అర్ధం చేసుకొనే వ్యక్తికి పుట్టిన రోజు శుభాకాంక్షలు. మీరు లేకపోతే నేను ఇప్పుడు ఉన్న స్థాయిలో సగానికి కూడా ఎదిగేదాన్ని కాదు. మీరు నా జీవితంలో ఉండడం, నేను మీ కూతురిగా పుట్టడం నా అదృష్టంగా భావిస్తాను." అంటూ ట్విట్ చేశారు. అంతేకాదు వారిద్దరూ కలిసి ఆప్యాయంగా దిగిన ఫోటోలను కూడా పోస్ట్ చేసింది.