హైదరాబాద్ మెట్రో పిల్లర్లకు ‘రేడియం’ స్టిక్కర్లు!

SMTV Desk 2017-06-18 13:43:14  hyderabad, pillers, accident, stickers, more

హైదరాబాద్‌, జూన్‌ 18 : ఇటీవల పలు ప్రమాదాలకు కారణమైన మెట్రో పిల్లర్లు కొత్త రూపు సంతరించుకోనున్నాయి. ఇండియన్‌ రోడ్డు కాంగ్రెస్‌(ఐఆర్‌సీ) నిబంధనల ప్రకారం ప్రమాదాలు జరగకుండా అదనపు హంగులు అద్దనున్నారు. వర్షాకాలం కావడంలో చినుకు పడితే అంధకారం నెలకొనే అవకాశం ఉన్న నేపథ్యంలో రాత్రి వేళల్లో ఎక్కువ ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుందని భావించి ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఐఆర్‌సీ అధికారులు వెల్లడించారు. ఏపీ మునిసిపల్‌ మంత్రి నారాయణ తనయుడు నిషిత్‌ నారాయణ గత నెలలో కారులో ప్రయాణిస్తూ మెట్రో పిల్లర్‌కు ఢీకొని మృతి చెందగా, ఓ పోలీస్‌ అధికారి కూడా ఇదే తరహాలో ప్రమాదానికి గురయ్యా డు. ఈ నేపథ్యంలో పిల్లర్లు ఉన్నట్టు తెలిసేలా.. రేడియం స్టిక్క ర్లు అంటించాలని నిర్ణయించారు. శనివారం మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ కార్యాలయంలో వివిధ విభాగాల సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు. హెచ్‌ఎండీఏ పరిధిలోని ప్రతి మునిసిపాల్టీలో ఒక్కో ప్రత్యేక పార్కు ఏర్పాటు చేయాలని పలు ప్రభుత్వ విభాగాలు నిర్ణయించినట్లు సమాచారం. ఔటర్‌ వరకు ఉన్న 183 గ్రామాలతోపాటు ఏడు ముని సిపాల్టీలకు వాటర్‌బోర్డు ద్వారా సురక్షిత తాగునీటిని అందించే ప్రయత్నాన్ని వేగవంతం చేయాలని భావిస్తున్నారు. విశ్వనగరంగా తీర్చిదిద్దే క్రమంలో హైదరాబాద్‌లో జరుగుతోన్న అభివృ ద్ధి, మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టు పనులకు అన్ని విభాగాలు పరస్పరం సహకరించాలని నిర్ణయించారు. వర్షాకాలం నేపథ్యం లో ఏర్పడుతోన్న గుంతలను ఎప్పటికప్పుడు పూడ్చాలని, ఇందుకు ప్రత్యేక యంత్రాన్ని సమకూర్చనున్నారు. రెండు పడకల ఇళ్ల నిర్మాణం కోసం గుర్తించిన భూములను జీహెచ్‌ఎంసీకి అప్ప గించాలని కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి రెవెన్యూ అధికారులను కోరినట్లు తెలిసింది.