వైట్ వాష్ పై భారత్ గురి

SMTV Desk 2017-12-24 11:07:31  india, srilanka, 3 rd t-20, mumbai

ముంబై, డిసెంబర్ 24 : భారత్- శ్రీలంక మధ్య చివరి నామమాత్రపు మూడో టీ-20 మ్యాచ్ ముంబై వేదికగా జరగనుంది. గత రెండు టీ-20లలో ఘన విజయం సాధించిన రోహిత్ సేన ఈ మ్యాచ్ గెలిచి సిరీస్ ను 3-0తో వైట్ వాష్ చేయాలనే ఆలోచనలో ఉంది. అంతే కాకుండా భారత్ జట్టు రిజర్వ్ బెంచ్ బలాన్ని పరీక్షించేందుకు ఇదే మంచి అవకాశంగా భావిస్తుంది. వరుస విజయాలతో ఊపు మీద ఉన్న భారత్ జట్టు ఈ మ్యాచ్ లో ఎలాగైనా నెగ్గి గెలుపుతో ఈ ఏడాది ముగించాలని ఆశపడుతుంది. లంకేయులు పర్యటనలో తొలుత టీమిండియాకు గట్టి పోటీనిచ్చిన తర్వాత మాత్రం అదే హవాను కొనసాగించలేకపోయారు. ప్రస్తుత భారత్ జట్టు జైత్రయాత్రను అడ్డుకోవాలంటే శ్రీలంక జట్టు తమ శక్తికి మించి పోరాడక తప్పదు. మరి వాంఖడెలో ఏం జరుగుతుందో చూడాలి. కాగా మ్యాచ్ ఈ రోజు సాయంత్రం 7.00 గంటలకు వాంఖడే స్టేడియంలో ప్రారంభం కానుంది.