పంచ్ పవర్ చూపిన విజేందర్‌..

SMTV Desk 2017-12-24 10:40:29   Vijender Singh, Ernest Amuzu, professional boxing, ghana, india

జైపూర్, డిసెంబర్ 24: ప్రొఫెషనల్‌ బాక్సింగ్‌లోకి అడుగుపెట్టాక ఇప్పటి వరకు ఓటమి ఎరుగని విజేందర్‌ మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఘనా బాక్సర్‌ ఎర్నెస్ట్‌ అముజుతో జరిగిన సూపర్‌ మిడిల్‌ వెయిట్‌ విభాగంలో శనివారం 10 రౌండ్లు లో ప్రత్యర్ధికి తన పంచ్ పవర్ ఏంటో చూపించాడు. ఈ బౌట్ ముందు విజేందర్ ఎముకలు విరిచేస్తాను అని బీరాలు పలికిన అముజు బౌట్ లో మాత్రం చేతులెత్తేశాడు. ఒకానొక దశలో విజేందర్ పంచ్ లకు తాళలేక రింగ్ చుట్టూ చక్కర్లు కొట్టాడు. మొత్తం 10 రౌండ్లు పాటు సాగిన ఈ పోరులో ముగ్గురు న్యాయనిర్ణేతలూ విజేందర్‌కే ఓటేశారు. అలాగే విజేందర్‌ తన డబ్ల్యూబీవో ఆసియా పసిఫిక్‌, డబ్ల్యూబీవో ఓరియంటల్‌ సూపర్‌ టైటిళ్లను సగర్వంగా నిలబెట్టుకున్నాడు. అంతే కాకుండా ఇప్పటి దాకా జరిగిన పది బౌట్లలోనూ విజయం సాధించాడు.