ఎమ్మార్పీ స్టిక్కర్లకు గడువు పెంచిన కేంద్ర ప్రభుత్వం

SMTV Desk 2017-12-23 16:41:18  ram vilas paswan, gst, mrp stickers, central consumer affairs minister

న్యూఢిల్లీ, డిసెంబర్ 23 : కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మక౦గా చేపట్టిన వస్తు, సేవలపన్ను(జీఎస్టీ) ను ప్రభుత్వం 2017 జూలై 01 నుండి ఆమలు చేస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ ఏడాది నవంబర్ లో జరిగిన 23వ జీఎస్‌టీ మండలి సమావేశంలో దాదాపు 200 వస్తువులపై పన్ను తగ్గించింది. ఈ నేపధ్యంలో జీఎస్టీ అమలు తర్వాత ఉత్పత్తులపై సవరించిన ఎమ్మార్పీ ధరలను ముద్రించేందుకు గడువును ప్రభుత్వం పొడిగించింది. సంస్థలు వచ్చే ఏడాది మార్చి వరకు ఎమ్మార్పీ స్టిక్కర్లను వేసుకునే సదుపాయం కల్పిస్తున్నట్లు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్‌ విలాస్‌ పాసవాన్‌ వెల్లడించారు.