అత్యంత అందగత్తెను చూశారా..

SMTV Desk 2017-12-23 16:00:48  Anok Yai, sudan, washington,

వాషింగ్టన్, డిసెంబర్ 23: ప్రతీ ఒక్కరి జీవితంలో కీలకమైన మలుపు తిరిగే రోజు వస్తుందని పెద్దలు అంటుంటారు. ఇది ఈ అమ్మాయి విషయంలో నిజమైంది. సుడాన్‌కు చెందిన ఓ మోడల్‌ జీవితం ఒక్క ఫోటో రాత్రికి రాత్రే అత్యంత అందగత్తెగా మార్చేసింది. ఇంతకి ఆమె ఎవరంటే.. వాషింగ్టన్‌లో హోవార్డ్‌ యూనివర్సిటీలో చదువుతున్న అనోక్‌ యాయి, ఆ సమయంలో ఓ ఫోటోగ్రాఫర్‌ని ఆమె సౌందర్య౦ బాగా ఆకర్షించింది. దీంతో అతను ఓ ఫోటో తీసి దానిని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేశాడు. దాంతో ఆమెకు బోలెడంత మంది అభిమానులను ఆకట్టుకుంది. ఆ తరువాత మోడలింగ్ రంగంలోకి ప్రవేశించటమే కాదు సూడాన్‌ లేడీ సూపర్‌గా చేసేసింది. ప్రస్తుతం ఆమె సంపాదన గంటకు 15,000 వేల డాలర్లపైగానే ఉందంట. అంతర్జాతీయ మాగ్జైన్‌లు సైతం టాప్‌ మోడళ్లను పక్కన పడేసి ఆమె ముఖచిత్రం కోసం పోటి పడుతున్నాయి.