ఉగ్రవాద అంశాలు బయటికి వచ్చాయా..?

SMTV Desk 2017-06-18 11:40:10  Facebook,Terrorist Topics,Website,Gardian News paper

శాన్‌ఫ్రాన్సిస్కో, జూన్ 18: ఫేస్‌బుక్‌ పేజీలు, బృందాల్లో.. అభ్యంతరకరమైన, ఉగ్రవాద సంబంధిత అంశాలను గుర్తించి, తొలగించే పరిశీలకుల (మాడరేటర్ల) వివరాలు బయటికి వచ్చాయని అనుమానాలు వ్యక్తమయ్యాయి. వెబ్‌సైట్‌ సాఫ్ట్‌వేర్‌లో గతేడాది చోటు చేసుకున్న ఓ భద్రత లోపం ఇందుకు వీలు కల్పించినందు వల్ల వార్తలు బయటకి వచ్చే అవకాశాలు ఉన్నాయని సమాచారం. ఆరుగురు పరిశీలకుల వివరాలను అనుమానిత ఉగ్రవాదులు చూసి ఉండవచ్చని గార్డియన్‌ పత్రిక పేర్కొంది. ఈ ఆరుగురిలో ఒకరు భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారని తెలిపింది. ఈ భద్రత లోపం జరిగినట్లు ఫేస్‌బుక్‌ కూడా అంగీకరించింది. దాన్ని సరిచేశామని.. ఇప్పటివరకూ పరిశీలకుల్లో ఎవరికీ బెదిరింపులు ఎదురవ్వలేదని పేర్కొంది. అనుమానిత ఇస్లామిక్‌ స్టేట్‌ సభ్యులు ఎవరూ.. పరిశీలకుల సమాచారం చూసిన దాఖలాలు లేవని తెలిపింది.