అఖిల్ నెక్స్ట్ మూవీ...?

SMTV Desk 2017-12-23 14:38:27  akkineni akhil, nagarjuna, akhil next movie.

హైదరాబాద్, డిసెంబర్ 23: “అఖిల్” సినిమాతో హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమలోకి వచ్చిన అక్కినేని అఖిల్, ఆ సినిమా తరువాత మళ్లీ ‘హలో’ అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. క్రిస్మస్ కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి టాక్ నే సొంతం చేసుకుంది. అయితే అఖిల్ నెక్స్ట్ మూవీ ఎవరితో చేయబోతున్నారు..? అనే ప్రశ్న అక్కినేని అభిమానుల్లోనే కాదు సినీ వర్గాలలో నెలకొంది. సిసింద్రీ తరువాత చేయబోయే మూవీ నాగార్జున భారీ బడ్జెట్ తో ప్లాన్ చేస్తున్నారట. అందుకనే కొరటాల శివ, బోయపాటి శ్రీను లాంటి పెద్ద పెద్ద దర్శకులను లైన్ లో పెట్టినట్లు సమాచారం. రంగస్థలం చిత్ర నిర్మాణంలో బిజీగా ఉన్న సుకుమార్ తో ఉండవచ్చనే పుకార్లు షికార్లు కొడుతున్నాయి.