నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం..!

SMTV Desk 2017-12-23 14:18:33  Rivership connectivity, godavari river, kaveri river,

అమరావతి, డిసెంబర్ 23: నూతన సంవత్సరంలో నదుల అనుసంధానంపై చర్చలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోని గోదావరి వరద నీటిని తమిళనాడులోని కావేరి నదికి అనుసంధానించేందుకు వీలుగా జాతీయ జల అభివృద్ధి సంస్థ ఓ ప్రణాళికను సర్వం సిద్ధం చేసింది. ఈ ప్రతిపాదనపై చర్చించేందుకు కేంద్రం జనవరిలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, ఛత్తీస్‌గఢ్‌ ముఖ్యమంత్రుల సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశం కేంద్ర జలవనరుల మంత్రి నితిన్‌ గడ్కరీ ఆధ్వర్యంలో జరుగనుంది. ఈ విషయాన్ని జాతీయ జల అభివృద్ధి సంస్థ అధికారులు ఆంధ్రప్రదేశ్‌ అధికారులకు తెలిపారు. ఈ అంశంపై ఛత్తీస్‌గఢ్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు రాష్ట్రాలకు పూర్తి పాఠాన్ని జాతీయ జల అభివృద్ధి సంస్థ తేలపనుంది. ఈ ప్రాజెక్టుపై నాలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఢిల్లీకి పిలిచి ప్రత్యేక సమావేశం నిర్వహిస్తారు.