చెన్నంపల్లి కోట నిధుల వేటలో మహాత్ముడి మనవడు...

SMTV Desk 2017-12-23 12:28:17  tushar arun gandhi, chennampally fort.

కర్నూలు, డిసెంబర్ 23: గుప్త నిధులు ఉన్నాయంటూ ఊరి జనంతో పాటు ప్రభుత్వం కూడా నమ్మి కర్నూలు జిల్లాలోని చెన్నంపల్లి కోటలో తవ్వకాలు మొదలు పెట్టాయి. ఈ తవ్వకాలపై సర్వత్ర విమర్శలు ఎదురైనప్పటికీ గుప్త నిధుల వేట మాత్రం కొనసాగుతూనే ఉంది. ఆరోపణలు ఎదురవుతున్న తవ్వకాలు కొనసాగుతుండడంతో దీని వెనుక ఉన్నది ఎవ్వరనేది అంతటా చర్చ జరుగుతోంది. మరోవైపు ఈ తవ్వకాల వివాదంలో జాతిపిత మహాత్మాగాంధీ మనవడి పేరు వెలుగులోకి రావడంతో విశేషం. ఈ తవ్వకాల్లో ప్రభుత్వ అధికారులతో పాటు మహాత్మాగాంధీ మనవడు తుషార్ అరుణ్ గాంధీ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తుషార్ గాంధీ సలహాదారుగా ఉన్న సంస్థే తవ్వకాలు జరిపిస్తోందని వెల్లడించారు. డెక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ కంపెనీ అనుబంధ కంపెనీ అయిన జియో మైసూర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కర్నూల్ లో 1500 ఎకరాల్లో మినరల్స్ అన్వేషించేందుకు అనుమతి సంపాదించి, జొన్నగిరి - ఎర్రగుడి ప్రాంతాల్లో కూడా తవ్వకాలు చేసేందుకు వారికి అనుమతులు వచ్చాయి. దీనికి తుషార్ గాంధీ సలహాదారుగా ఉన్నారు. కానీ ఎప్పుడూ వినపడని రాని తుషార్ గాంధీ పేరు ఇందులో వినిపిస్తుండడంపై భిన్నాభిప్రాయాలు వెల్లువెత్తుతున్నాయి