ఓరుగల్లులో భవిష్యత్ తరాల కోసం కళావైభవం

SMTV Desk 2017-06-17 19:55:34  Sanctioned .Why, History of Kakatiya kings, Qila Warangal Fort,Tourism Minister Ajmeri Chandulal

వరంగల్, జూన్ 17 : తెలంగాణ రాష్ట్రంలో ఒక్కటైనా ఓరుగల్లు అజరామరంగా పరిపాలించిన కాకతీయ రాజుల చరిత్రను భవిష్యత్ తరాలకు తెలియజేయడం కోసం ఓరుగల్ల్ మూడు రోజుల పాటు కళావైభవం ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు గిరిజన సంక్షేమం, పర్యాటక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ వెల్లడించారు. హన్మకొండ హోటల్ హరిత కాకతీయలో ఏర్పాటు చేసిన ఓరుగల్లు కళావైభవం ఉత్సవాలను మంత్రి శుక్రవారం ప్రారంభించారు. నవలాకారుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత అంపశయ్య నవీన్ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఓరుగల్లు కళావైభవాన్ని, సాంస్కృతిక, కళా రూపాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించే విధంగా ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఓరుగల్లుకు ప్రత్యేక చరిత్రను ఉత్సవాల రూపంలో భవిష్యత్ తరాలకు అందించాలనే సంకల్పంతోనే సీఎం కేసీఆర్ వేడుకలను వైభవంగా నిర్వహించాలని ఆదేశించినట్టు తెలిపారు. పర్యాటక శాఖ చైర్మన్ పేర్వారం రాములు మాట్లాడుతూ ఓరుగల్లును ప్రముఖ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు అధిక నిధులను మంజూరు చేయాల్సి ఉందని అన్నారు. ఖిలా వరంగల్ కోటను దాని పరిసరాలను రూ.100 కోట్ల నిధులతో అభివృద్ధి చేయనున్నట్టు తెలిపారు. ప్రారంభోత్సవ సమావేశంలో ఎమ్మెల్యేలు దాస్యం వినయ్‌భాస్కర్, కొండా సురేఖ, తాటికొండ రాజ య్య, కలెక్టర్, సీపీ సుధీర్‌బాబు, హాస్యనటుడు వేణుమాధవ్‌తో పాటు ప్రముఖ రచయితలు, కవులు, మేధావులు తదితరులు పాల్గొన్నారు. ఈ ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకొని యువత కాకతీయ కళావైభవాన్ని ప్రపంచనికి చాటలని మంత్రి పిలుపునిచ్చారు.