10 ఓవర్లు...9 వికెట్లు...8పరుగులు

SMTV Desk 2017-12-22 23:39:21  vidarbha, haryana, komal jan jaadh,

డిసెంబర్ 22, కోల్‌కతా : పైన గణాంకాలు చూసి ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా...? మహిళా వన్డే క్రికెట్ లో విదర్భ జట్టు మీడియం పేస్‌ బౌలర్‌ కోమల్ జన్‌జాద్ బౌలింగ్ గణాంకాలు.. 9.4 ఓవర్లలో 5 మెయిడెన్లు, 08 పరుగులు ఇచ్చి 09 వికెట్లు తీశారు. ఈ అసాధారణ ప్రదర్శనకు బీసీసీఐ సీనియర్‌ మహిళల వన్డే లీగ్‌ వేదికైంది. కోల్‌కతాలో గురువారం విదర్భ-హరియాణా జట్ల మధ్య జరిగిన క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో ఈ రికార్డు నమోదయ్యింది. కోమల్ బౌలింగ్ ధాటికి హర్యానా జట్టు 18.4 ఓవర్లలో 31 పరుగులకే ఆలౌటైంది. అనంతరం లక్ష్య చేధన ఆరంభించిన విదర్భ జట్టు జట్టు కేవలం 4.4 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా విజయం సాధించింది.