నదీ జలాలు రంగు మారడానికి కారణం ఇదే...

SMTV Desk 2017-12-22 16:37:30  Brahmaputra tributary, pradeep kumar,

న్యూఢిల్లీ, డిసెంబర్ 22: బ్రహ్మపుత్ర ఉపనది సియాంగ్‌ నదీ జలాలు నలుపు రంగులోకి మారి తాగడానికి పనికి రాకుండా మారిన విషయం తెలిసిందే. నదిలోని నీరు రంగు మారటానికి గల కారణాలు ఎగువ ప్రాంతంలో చైనా సిమెంటు నిర్మాణ పనులు లేదా సొరంగ మార్గం చేపట్టడం వల్లేనని అందరూ అనుమానించారు. ఈ నేపథ్యంలోనే నదీ జలాలను ల్యాబ్‌కు టెస్టుల నిమిత్తం పంపించారు. దీనిపై సెంట్రల్‌ వాటర్‌ కమిషన్‌సభ్యుడు ప్రదీప్‌ కుమార్‌ ఓ ఆంగ్ల మీడియాతో మాట్లాడుతూ... " నదీ జలాలు రంగు మారడంలో ఎటువంటి కుట్ర దాగి లేదు. కొండచరియలు విరిగిపడటంతో వచ్చిన కాలుష్యం కారణంగానే నీరు రంగు మారింది. ఎగువ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులున్నాయనే దానికి సంబంధించి ఉపగ్రహ ఛాయాచిత్రాలను పరిశీలిస్తున్నాం. త్వరలోనే దీనికి సంబంధించిన ఓ స్పష్టమైన కారణాన్ని తెలియజేస్తాం" అని తెలిపారు.