2జీ కేసులో ఏడేళ్ళపాటు నిరీక్షించా: సీబీఐ కోర్టు జడ్జి

SMTV Desk 2017-12-22 16:30:35  opi saini, patiyala court, 2g case, final judjiment

న్యూ డిల్లీ, డిసెంబర్ 22: దేశవ్యాప్త సంచలనం రేపిన 2జీ స్పెక్ట్రం కేసును విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు జడ్జి ఓపీ సైనీ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ కేసు తుది తీర్పు దేశమంతా ఉత్కంఠ రేపగా..ప్రధాన నిందితులుగా ఉన్న రాజా, కనిమొలి లను నిర్దోషులుగా కోర్టు స్పష్టం చేసింది. తుది తీర్పు అనంతరం జడ్జి సైనీ మాట్లాడుతూ..ఈ కేసులో ఎవరైనా చట్టపరమైన ఆధారాలను అందిస్తారేమోనని ఏడేళ్ళపాటు నిరీక్షించా. కానీ ఎవ్వరూ సాక్ష్యాధారాలు ఇవ్వలేదు. నా నిరీక్షణ ఫలించలేదు. ప్రచారంలో ఉన్న వదంతులు, ఊహాగానాల ఆధారంగానే అందరూ 2జీ కేసులో ఏదో జరిగిపోయిందని అనుకున్నారు. కానీ వదంతులు, ఊహాగానాలకు కోర్టులో స్థానం ఉండదని ఆయన పేర్కొన్నారు.