ఏవో అక్రమార్జన ఆస్తులు...

SMTV Desk 2017-12-22 12:25:19  AO krishna kishore, nellore, acb

నెల్లూరు, డిసెంబర్ 22: నగరంలో రవాణా శాఖ పరిపాలనా అధికారి (ఏవో), ఇన్‌ఛార్జి ఆర్టీవోగా పనిచేస్తున్న బొల్లాపల్లి శేషాద్రి కృష్ణకిశోర్‌ నివాసంలో అనిశా అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. ఈ సోదాల్లో దాదాపు రూ.2.5కోట్ల విలువైన చర, స్థిర ఆస్తులను గుర్తించారు. వీటి విలువ బహిరంగ మార్కెట్‌లో రూ.50 కోట్ల నుంచి రూ.60 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అనంతరం కృష్ణకిశోర్‌ను అరెస్టు చేశారు. శుక్రవారం ఉదయం అనిశా కోర్డులో ఆయన్ను హాజరుపరచనున్నట్లు తెలిపారు. గుంటూరులోని కొరిటెపాడులో ఏవో తండ్రి వేంకటేశ్వర్లు నివాసంలో, పిడుగురాళ్లలో భార్య టి.అనురాధ నివాసంలో, నరసరావుపేటలోని ప్రకాశ్‌నగర్‌లో సోదరుడు బి.శ్రీనివాసరాంప్రసాద్‌ ఇంట్లో అనిశా సోదాలు చేపట్టారు. సోదరుడి నివాసంలో 6 కాలుష్య ిర్ధరణ సంచార వాహనాలతోపాటు, లారీలకు సంబంధించిన పత్రాలు లభించాయి. సోదరుని పేరుతో డ్రైవింగ్‌ స్కూల్‌కు సంబంధించిన లారీలు ఉన్నట్లు గుర్తించారు. వీటితో పాటు 250 గ్రాముల బంగారు ఆభరణాలు, 350 గ్రాముల వెండి వస్తువులు, రూ.1.37 లక్షల నగదు, అధికారులు స్వాధీనం చేసుకున్నారు.