2022 కామన్వెల్త్‌ క్రీడల వేదిక మార్పు..!

SMTV Desk 2017-12-22 11:46:02  Commonwealth of Nations, England, birmingham.

లండన్, డిసెంబర్ 22 : 2022 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చే అవకాశాన్ని ఇంగ్లాండ్‌లోని బర్మింగ్‌హామ్‌ సొంతం చేసుకుంది. తొలుత దక్షిణాఫ్రికాలోని డర్బన్‌ లో జరగాల్సిన ఈ టోర్నీ.. పలు ఆర్ధిక కారణాల రిత్యా తాము ఈ క్రీడలను నిర్వహించలేమంటూ దక్షిణాఫ్రికా వెల్లడించింది. ఈ నేపథ్యంలో మళ్ళీ బిడ్డింగ్ నిర్వహించిన కామన్వెల్త్ క్రీడల యాజమాన్యం బర్మింగ్ హామ్‌ను ఎంపిక చేశారు.