2017@ చాహల్ నెంబర్.1

SMTV Desk 2017-12-21 17:01:42  chahal, highest wicket taker, indian cricket player, spinner

కటక్, డిసెంబర్ 21 : భారత్ క్రికెట్ జట్టు లో తనదైన మార్క్ ను చూపెడుతూ దూసుకుపోతున్నాడు స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్. నిన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్ లో ఏకంగా 4 వికెట్లు తీసి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కాగా ఈ 4 వికెట్లతో చాహల్ ఈ ఏడాది టీ-20 మ్యాచ్ ల్లో అత్యధిక వికెట్లు తీసుకున్న వ్యక్తిగా రికార్డులోకెక్కాడు. భారత్ తరపున ఈ సంవత్సరం 10 టీ-20 మ్యాచ్ లు ఆడిన ఈ యువ స్పిన్నర్ (19) వికెట్లతో అగ్రస్థానంలో నిలిచాడు. తర్వాతి స్థానంలో అఫ్ఘనిస్తాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ (17), కరేబియన్ పేసర్ క్రేసిక్ విలియమ్స్ (17) ఉన్నారు.