సచిన్ మెయిడిన్ మాట "వాయిదా"

SMTV Desk 2017-12-21 15:45:38  sachin tendlukar, mp, rajya sabha, maiden speech

న్యూఢిల్లీ, డిసెంబర్ 21 : రాజ్యసభలో తొలి సారిగా పార్లమెంట్ సభ్యుడు, మాజీ క్రికెటర్ సచిన్ టెండుల్కర్ కు ఈ సారి చుక్కెదురైంది. సచిన్ క్రీడలుకు సంబంధించిన విషయం పై చర్చ లేవనెత్తగా ప్రతిపక్ష కాంగ్రెస్ సభకు అంతరాయం కలిగించింది. సభలో గందరగోళం నెలకొనడంతో రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు కాంగ్రెస్ సభ్యులను సహనం వహించమని చెప్పినప్పటికీ వినలేదు. దీంతో రాజ్యసభ రేపటికి వాయిదా పడింది. ఇంతక ముందు సచిన్‌ పార్లమెంట్ హాజరుపై పెద్ద వివాదం కూడా జరిగింది. నామినేట్‌ సభ్యులుగా వచ్చిన సెలబ్రిటీల హాజరుశాతం తక్కువగా ఉందని.. అలాంటి వారిని పదవి నుంచి తప్పించాలని కూడా గతంలో విమర్శలు వచ్చిన విషయం తెలిసిందే.