బ్రెగ్జిట్‌ కు తుది గడువు 31 డిసెంబర్‌ 2020: ఈయూ

SMTV Desk 2017-12-21 15:17:07  brexit, eu, last date, britan, eu updates

లండన్, డిసెంబర్ 21: యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బ్రిటన్ వైదొలిగిన విషయం తెలిసిందే. దీనికి సంబంధించి బ్రిటన్ ప్రజాభిప్రాయాన్ని కోరగా మెజారిటీ ప్రజలు బ్రెగ్జిట్ కే మొగ్గు చూపారు. కాగా బ్రెగ్జిట్ అధికారిక ప్రక్రియకు 2020, డిసెంబర్‌ 31ను తుది గడువుగా ఈయూ నిర్ణయించింది. ఆ గడువు అనంతరం 28 సభ్య దేశాల కూటమి నుంచి బ్రిటన్‌ వైదొలిగినట్లుగా పరిగణిస్తామని ఈయూ తెలిపింది. బ్రిటన్‌తో భవిష్యత్తు సంబంధాలపై యూరోపియన్‌ యూనియన్ మార్గదర్శకాల్ని విడుదల చేస్తూ బ్రెగ్జిట్‌ అమలుకు వ్యవధిని నిర్దేశించింది. బ్రెగ్జిట్‌ అమలు సమయంలో యూరోపియన్‌ యూనియన్‌ వర్తక చట్టాల్ని బ్రిటన్‌ పాటించాలని, అలాగే కస్టమ్స్‌ నిబంధనలు, ఒకే మార్కెట్‌ విధానాలు కూడా వర్తిస్తాయని, అందులో ఎలాంటి మినహాయింపులు ఉండవని ఈయూ పేర్కొంది.