టాప్ 3 లోకి వచ్చిన ధోని..!

SMTV Desk 2017-12-21 15:15:57  MS Dhoni, 3rd place, T20 Match, india, srilanka, bhuvaneshvar, katak.

కటక్, డిసెంబర్ 21 : అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్ నుండి అత్యధిక పరుగు సాధించిన మూడవ ఆటగాడిగా ఎం.ఎస్ ధోని నిలిచారు. కాగా టీ20 క్రికెట్‌లో ఆయన సాధించిన పరుగుల సంఖ్య 1,320కి చేరింది. ఇప్పటివరకు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో భారత్‌ తరఫున అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్లలో భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లి(1,956) ప్రథమ స్థానంలో ఉండగా, రోహిత్ శర్మ(1,502) రెండవ స్థానంలో ఉన్నారు. నిన్న కటక్ బరాబతి స్టేడియంలో శ్రీలంకతో జరిగిన టీ20 మ్యాచ్ లో ధోనీ 39 పరుగులతో జట్టుకు భారీ స్కోర్ ను అందించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడవ స్థానంలో ఉన్న సురేష్ రైనా(1,307) స్థానాన్ని ధోని ఆక్రమించుకున్నారు.