కొండచిలువతో సాహసం చేసిన చిన్నారి..

SMTV Desk 2017-12-21 13:31:21  Python snake, uk, london,

లండన్, డిసెంబర్ 21: పామును చూడగానే అందరూ అల్లంత దూరాన పారిపోతారు. ఏకంగా కొండచిలువను చూస్తే ఇక అంతే, ప్రాణాలు పోయినంత పని అవుతుంది. అలాంటి కొండచిలువను ఒళ్లో పడుకోబెట్టుకొని దాంతో ఆడుకుంటూ చాక్లెట్ తింటూ పాలు తాగుతుంది ఓ చిన్నారి. యునైటెడ్ కింగ్ డమ్ కు చెందిన ఈ చిన్నారి సాహసపు ఫోటో ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఆ చిన్నారి ధైర్యాన్ని నెటిజన్లు అభినందిస్తున్నారు.