పుట్టిన రోజు నాడే.. అనంత లోకాలకు...

SMTV Desk 2017-12-21 13:31:21  accident at vairam, lorry accident in khammam.

వైరా, డిసెంబర్ 21: ఐదేళ్ల చిన్నారి యామిని పుట్టిన రోజునాడే అనంత లోకాలకు పయనమయ్యింది. వైరా సమీపంలో చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో యామినితో పాటు దావీదు అనే వ్యక్తం మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... తల్లాడ నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న లారీ, పినపాక స్టేజి వద్ద అదుపుతప్పి రహదారి పక్కనే ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లి బోల్తా కొట్టింది. దీంతో యామని, దావీదులు అక్కడిక్కక్కడే మృతి చెందగా, మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చిన్నారి యామిని తల, మొండెం తెగిపడడంతో ఆ ప్రాంతమంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. విషయం తెలుసుకున్న ఖమ్మం, వైరం డీఎస్పీలు సదానిరంజన్‌లు, ప్రసన్నకుమార్‌ సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. హోటల్‌లోకి దూసుకెళ్లిన లారీని క్రేన్‌ సాయంతో బయటకు తీసి, మృతేదహాలను పంచనామా నిమిత్తం ఖమ్మం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.