రాజ్యసభలో తొలిసారి గళం విప్పనున్న సచిన్‌

SMTV Desk 2017-12-21 13:30:21  sachin tendulkar, mp, rajyasabha, parliment

న్యూఢిల్లీ, డిసెంబర్ 21 : ప్రపంచ క్రికెట్ దిగ్గజం, మాస్టర్ బ్లాస్టర్, రాజ్యసభ సభ్యుడు సచిన్‌ టెండూల్కర్ రాజ్యసభలో తొలి సారిగా తన గళం వినిపించనున్నారు. 2012లో సచిన్‌ రాజ్యసభకు నామినేట్‌ అయినప్పటి నుండి సభలో ఓ అంశంపై చర్చ ప్రారంభించడం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. కాగా అప్పట్లో సచిన్ అప్పడప్పుడు పార్లమెంట్‌ సమావేశాలకు రావడంపై పెద్ద దుమారమే చెలరేగింది. అంతే కాకుండా సభకు హాజరైనా.. ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉంటారన్న విమర్శలు కూడా వెల్లువెత్తాయి. కాగా గురువారం జరిగే పార్లమెంట్‌ సమావేశాల్లో సచిన్ ‌"పిల్లలకు ఆడుకునే హక్కు" అనే అంశంపై చర్చకు తెరలేపనున్నారు.