సినీ ఫక్కిలో.. ప్రేమ..పెళ్లి..పరార్...!

SMTV Desk 2017-12-21 11:55:46  fake marriage, lady fake marriage, escape fro marriage.

మొరాదాబాద్ : సినిమాలు చూసి కొందరు, మనం కూడా అలా చేసి లైఫ్ సెట్టిల్ చేసుకొందామని నేరాలకు తెర లేపుతున్నారు. సోనమ్ కపూర్ నటించిన “డాలీ కి డోలి” అనే చిత్రాన్ని చూసిన దంపతులు మేము కూడా సినిమాలోలాగా చేసి డబ్బు సంపాదించుకోవాలని చివరికి కటకటాల పాలయ్యారు. యూపీ జిల్లా ఎస్పీ ఉదయ్ శంకర్ తెలిపిన వివరాల ప్రకారం... ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని డెహ్రాడూన్ నగరానికి చెందిన ప్రీతీ అనే వివాహిత తన భర్తతో కలిసి దొంగ పెళ్లిళ్ల చేసుకుంది. ప్రీతి అందంగా అలంకరించుకొని వచ్చి యువకులను ప్రేమిస్తున్నానంటూ పెళ్లి చేసుకోమని అడిగేది. కలువ కన్నుల చిన్నదే (ప్రీతీ) అడగడంతో యువకులు పెళ్లికి రెడీ సిద్దమయ్యేవారు. అంతే మూడు ముళ్లు పడిన మొదలు ఎప్పుడు మాయం అవుతుందో తెలియదు, నగలు, డబ్బుతో ఉడాయించేది. ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు 12 మంది పెళ్ళికొడుకులను మోసచేసిందని ఆయన తెలిపారు. సమాజంలో తమ పరువు పోతుందనే భయంతో వరులైన యువకులు ఫిర్యాదు చేసేందుకు ముందుకు రావడం లేదని ఆయన వెల్లడించారు. ఈ కేలాడి లేడి ప్రీతి యువకులను ఆకర్షించి, వారిని పెళ్లి చేసుకొని పారిపొయ్యే నాటకంలో భర్త పాత్ర కూడా ఉందని, పెళ్లి ఏర్పాట్లు భర్తే చూసే వాడని పోలీసులు పేర్కొన్నారు.