ఉపాధ్యాయురాలిపై చేసిన ఘాతుకానికి.. జీవిత ఖైదు...

SMTV Desk 2017-12-21 11:42:24  Teacher, students, Sexual assault, Bangalore

బెంగళూరు, డిసెంబర్ 21 : బోధన చేసిన ఉపాధ్యాయురాలిని నలుగురు పూర్వ విద్యార్థులు అపహరించి, సామూహిక అత్యాచారం చేయడమే కాకుండా కిరాతకంగా హత్యకు పాల్పడటంతో, కర్ణాటకలోని రామనగర జిల్లా న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. బెంగళూరులోని నగర శివారు బసవనపురలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయురాలు(29) విజ్ఞాన శాస్త్రాన్ని బోధించేవారు. గతంలో అదే పాఠశాలలో చదువుకున్న రవి, మంజునాథ్‌, రవీశ, నరసింహలు, 2009 ఆగస్టు 2న ఆమె ఇంటికి వెళ్లే సమయంలో కారులో దించుతామని నమ్మించి ఆ ఉపాధ్యాయురాలిని ఎక్కించుకున్నారు. మార్గ మధ్యలో ఆమెను కత్తితో బెదిరించి, సావనదుర్గ పర్వత సానువుల వైపు తీసుకు వెళ్లి, నలుగురు ఆమెపై లైంగిక దాడి చేసి, అనంతరం గొంతు నులిమి హత్య చేసి, ఆభరణాలను దోచుకుని పరారయ్యారు. ఘటన జరిగిన పది రోజుల్లోనే పోలీసులు ఆ నిందితులను అరెస్టు చేశారు. ఈ మేరకు ఎనిమిదేళ్లపాటు రామనగర జిల్లా హైకోర్టులో దర్యాప్తు చేపట్టి, ఈ నెల 20న నిందితులను జీవితాంతం కారాగారంలో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది.