ఈ చేప ఎత్తు ఆరు అడుగులు.. బరువు 60 కిలోలు..

SMTV Desk 2017-12-21 10:43:33   Nemalikonam, MACHILIPATNAM, GILAKALADINDI,

మచిలీపట్నం, డిసెంబర్ 21: ఇటీవల సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులకు సుమారు ఆరు అడుగుల పొడవు, 60 కిలోల బరువు ఉన్న చేపలు చిక్కాయి. కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని గిలకలదిండి వద్ద వేటకు వెళ్లి పన్నెండు రోజుల తరువాత బుధవారం వారు ఒడ్డుకు తిరిగి వచ్చారు. ఈ సందర్భంగా తూర, నెమలికోనాం, కొమ్ముకోనాం వంటి చేపలు సహా టైగర్‌ రొయ్యలనూ అధిక సంఖ్యలో తమ వెంట తీసుకొచ్చారు. వీటిల్లో నెమలికోనాం చేపలు 6 0 కిలోలు తుగాయి. వీటి ధర కిలోకు రూ. 200 నుంచి రూ. 300 వరకు ఉంటుందని జాలర్లు తెలిపారు.