నష్టాల్లో ముగిసిన సెన్సెక్స్...

SMTV Desk 2017-12-20 17:06:58  stock market, sensex, loss, nifti.

ముంబై, డిసెంబర్ 20 : అంతర్జాతీయ పరిణామాల దృశ్య, వాహన షేర్ల అండతో కొత్త రికార్డులను తాకిన స్టాక్‌ మార్కెట్లు నేడు ఒక్కసారిగా నష్టాలను నమోదు చేశాయి. మార్కెట్ల బలహీనతల నేపథ్యంలో రికార్డుల నుంచి పడిపోయిన సూచీలు.. కాస్తంత నష్టాలను నమోదు చేశాయి. ప్రస్తుత౦ సెన్సెక్స్‌ 60 పాయింట్లు పడిపోగా.. నిఫ్టీ 10,400 మార్క్‌ను నిలబెట్టుకోగలిగింది. ఈ ఉదయం లాభాలతోనే ప్రారంభమైన సెన్సెక్స్‌ మదుపర్ల లాభాల స్వీకరణతో వెంటనే నష్టాల్లోకి జారుకుంది. అనంతరం కాస్తంత నెమ్మదిగా సాగిన సూచీ, చివరకు 59 పాయింట్లు నష్టపోయి 33,777 వద్ద స్థిరపడింది. నిఫ్టీ కూడా స్వల్పంగా 19 పాయింట్లు కోల్పోయి 10,444 వద్ద ముగిసింది.